ముఖ్యమంత్రి సహాయనిధి చంద్రన్న బీమా చెక్కలు పంపిణీ చేసిన : కందుల

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలను మార్కపురం మాజీ శాసన సభ్యులు తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి పొదిలి రోడ్లు భవనాల అతిథి గృహంలో బుధవారం ఉదయం చెక్కలను పంపిణీ చేసారు. ఇండ్ల రాములమ్మ భర్త చనిపోవటంతో అమెకు 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా చెక్కను పంపిణీ చేసారు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మాలపాటి వెంకట సుబ్బారావు కు 1లక్ష15వేల 846 రూపాయలు చలవాది సుబ్బలుకు 25వేల710 రూపాయలు చెక్కలను పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి పెద్ద బాబు గునుపూడి భాస్కర్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రసూల్ మహ్మమద్ షబ్బీర్ ముల్లా ఖూద్దస్ షెక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు