శాసనమండలి శాశ్వత రద్దు?…. 27వ తేది శాసనసభలో తీర్మానం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాశ్వత రద్దుకై జనవరి 27వతేది శాసనసభలో పూర్తిస్థాయి చర్చ జరిపి శాసనమండలి శాశ్వత రద్దుకై తీర్మానాన్ని ఆమోదించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
వివరాల్లోకి వెళితే గురువారంనాడు జరిగిన శాసనసభలో….. బుధవారంనాడు శాసనమండలిలో ఏక పక్షంగా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సోమవారంనాడు శాసనసభను కొనసాగించి శాసనమండలి కొనసాగింపుపై చర్చించి తీర్మానం చేద్దామని పేర్కొనడంతో శాసనమండలి శాశ్వత రద్దు జరిగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.