ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు : రాష్ట్ర రక్షణ శాఖ

ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలు వేదికగా జరుగుతున్న ప్రచారం పార్ధి గ్యాంగులు , మరికొన్ని ముఠాలు చిన్న పిల్లలను అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని , శరీరంలోని అవయవాలను తీసేస్తున్నారని ఈ ముఠాలు రాష్ట్రంలో పలుచోట్ల సంచరిస్తున్నట్టు అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర రక్షణశాఖ స్పందిస్తూ ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని ఇదంతా కొందరు ఆకతాయిలు చేస్తున్న పని అని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర రక్షణ శాఖ తెలిపింది ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రక్షణ శాఖ తెలిపింది.