ప్రత్యేకహోదా కోసం రిలే నిరాహారదీక్ష

 పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆద్వర్యం లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ పేదల పార్టీ జాతీయ అధ్యక్షుడు యుద్ధం నరసింహారావు డిమాండ్ చేసారు సిపియం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రత్యేకహోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కానీ మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి చూపించిందని ఎన్నికలసమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది అన్నారు. మాజీ సర్పంచ్ ఐజక్ మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలసమయంలో మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడలేదు ఏవైనా కంపెనీలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా ముఖ్యం ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం హోదా అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఇదివరకు తెలంగాణ లో ఏ విధంగా అయితే పోరాటాలు చేసి తెలంగాణాను సంపాదించుకున్నారో అలానే ప్రజలందరూ ఏకమై దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వంపై యుద్దానికి సిద్ధం అయ్యే దిశగా అడుగులు వేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపియం కాంగ్రెస్ పేదలపార్టీ వివిధ ప్రజాసంఘలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు