ముచ్చెమటలు పట్టించిన సబ్ కలెక్టర్ అపరంజత్ సింగ్
పొదిలి పట్టణములోని సచివాలయం 2, రైతు భరోసా, పౌరసరఫరాల శాఖ గిడ్డంగి నీ కందుకూరు సబ్ కలెక్టర్ అపరంజత్ సింగ్ సందర్శించి దస్త్రాలను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.
తొలిత సచివాలయం 2 ను సందర్శించి అక్కడ బయోమెట్రిక్ ను పరిశీలించి గైర్హాజరైన సిబ్బంది వివరాలు మరియు వ్యాక్సిన్ ప్రక్రియ వేగం లేకపోవడం వాలంటీర్లు పనితీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తదుపరి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ సంబంధించిన దస్త్రాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసి చరవాణీ ద్వారా వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్లో ఉన్న పౌరసరఫరాల గిడ్డంగి నందు తనిఖీలు నిర్వహించి సంబంధించిన దస్త్రాలు లేకపోవడం దొనకొండ విభాగం ఇన్చార్జ్ శ్రీనివాసులు పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచి జిల్లా పౌరసరఫరాల అధికారి తో మాట్లాడి ఇతను సేవలు అందించాటంలో విఫలమైయ్యరని విరిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం శ్రీనువాసులను నువ్వు ఏదైనా పని చేసుకో ఇంకా నీ సేవాలు అవసరం లేదంటూ గర్జించారు. తదుపరి పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు వివిధ దస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు