ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులుగా అబ్దుల్ రెహ్మాన్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ రెహ్మాన్ నియమిస్తూ జిల్లా అధ్యక్షులు వినుకొండ రాజారావు శనివారం నాడు నియామకం పత్రాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక ఒంగోలు లోని సంస్థ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ రెహ్మాన్ ను పొదిలి తాలుకా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు షేక్ నూర్ భాషా, ఒంగోలు టౌన్ అధ్యక్షుడు పి నవకాంత్, కంభం అధ్యక్షురాలు బండి లక్ష్మీ ప్రసన్న, వియస్.ప్రసాదరావు , అంగలకుర్తి నరసింహ రావు , మాకినేని మురళి , నాగభూషణాచారి, యస్.నారాయణ, కోమల్ కమార్ , అనీల్ కమార్,శీలం వెంకటేష్, జి మాధవాచారి , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.