మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా ఇన్చార్జ్ గా బండి నియామకం

మాదిగ రాజకీయ పోరాట సమితి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్ గా పొదిలి మండలం పాములపాడు గ్రామం చెందిన బండి నరేష్ మాదిగ ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ ఉత్తర్వులు అందించారని నరేష్ ఒక ప్రకటన లో తెలిపారు.

తనతోపాటు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రేవురి యేసుకుమారిని నియామకం చేసారని తెలిపారు.

త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి మాదిగల ఆత్మగౌరవం కోసం , మాదిగల రాజ్యాధికారం సాధన కోసం పని చేస్తామని బండి నరేష్ మాదిగ ఒక ప్రకటన లో తెలిపారు.