ఏప్రిల్ 7న సియం జగన్ పొదిలి పర్యటన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదిలి మండలం ముగచింతల గ్రామ సమీపంలోని దొనకొండ క్రాస్ రోడ్ వద్ద మేమంతా సిద్ధం కార్యక్రమంలో హాజరుకానున్నారు.
అందులో భాగంగా స్థల పరిశీలన భాగంగా ఆదివారం నాడు స్ధానిక దొనకొండ క్రాస్ రోడ్ వద్ద స్థలాన్ని ఒంగోలు పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు, ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ తలశీల రాఘరాం తదితరులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, పొదిలి కొనకనమిట్ల మండలాల చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు