అనారోగ్యంతో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల ప్రాంగణంలో వ్యక్తి మృతి
కొండెపి మండలం పెట్లూరుకు చెందిన నెలమల్లి రామారావు (46) మంగళవారంనాడు ఆర్టీసీ బస్సుల ప్రయాణికుల ప్రాంగణంలో చలనం లేకుండా పడి ఉండడం గమనించిన డిపో కంట్రోలర్ పి శ్రీనివాసమూర్తి, డిపో హెడ్ గార్డు కొండయ్యలు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
అనంతరం అతని చిరునామా కోసం బ్యాగును తెరచి చూడగా కర్ణాటకకు చెందిన ఆసుపత్రి రిపోర్టులు ఉండగా అవి పరిశీలించిన వైద్యులు…. ఆ వ్యక్తి పలు వ్యాధులతో బాధపడుతున్నట్లు అనారోగ్యం కారణంగానే అతను మృతి చెంది ఉండవచ్చని తెలిపారు.