ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ చేయాలని ధర్నా
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల వేతనాలు సవరణ చేయాలని కోరుతూ పొదిలి గ్యారేజ్ గేటువద్ద ఆర్టీసీ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల పలు న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం వైఫల్యం చెందాయని వాటికి నిరసనగా ఫిబ్రవరి6వ తేది నుండి తలపెట్టిన కార్మికుల సమ్మె విజయవంతం చేయడంలో భాగంగా నేడు ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేషయ్య, రామకృష్ణ, ఎ దివాకర్, పియన్ రెడ్డి, రోషన్, వై కొండలు, అన్ని కార్మిక సంఘాలు తదితరులు పాల్గొన్నారు.