ఆక్వా హబ్ రిటైల్ యూనిట్లు దరఖాస్తులు ఆహ్వానం
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మంగళవారం నాడు మత్స శాఖ ఆధ్వర్యంలో మత్సకారులతో
ఆక్వా హబ్ సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలను రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చి తద్వారా పోషక విలువలు కలిగిన చేపాహారం వినియోగాన్ని పెంచడానికి మత్స శాఖ ద్వారా ఆక్వా హబ్లు మరియు వివిధ రిటైల్ యూనిట్లు ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్ పై ఏర్పాటు చేయుటకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రెండు వేల్యూయాడెట్ కేంద్రాలను ఏర్పాటు మరియు మున్సిపల్ పరిధిలో 20 పైగా యూనిట్లు, మరియు మిని ఫిష్ రిటైల్ యూనిట్లు కు ఏర్పాటుకు ప్రక్రియను పూర్తి చేసి జనవరి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు తమ యొక్క అనుమానాలను పలు అంశాలపై అధికారులను అడగ్గా వారి అనుమానాలను అధికారులు నివృత్తి చేసారు.