ARF ఆధ్వర్యంలో కవాతు
పొదిలి పోలీస్ స్టేషన్ నుండి పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు యస్ఐ నాగరాజు ఆద్వర్యం లో యాంటీ ర్యాపిడ్ ఫోర్స్ కవాతు ర్యాలీని పొదిలి పోలీస్ స్టేషన్ నుండి విశ్వనాథపురం ఎన్జీఓ కాలనీ నవబ్ మిట్ట తూర్పు పాలెం తాలూకా ఆఫీస్ విధి చిన్న బస్టాండ్ రధంరోడ్డు మెయిన్ రోడ్ మీదాగా తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరింది ఈ సందర్భంగా పొదిలి సి ఐ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ARF బృందం దేశం మెత్తం మీద సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మత ఘర్షణలు జరగకుండా ఈ బృందం అన్ని పట్టణాల్లో గల సున్నితమైన ప్రాంతాలను కవాతు నిర్వహించి ప్రజల భద్రత పై బరొస కల్పించేందుకు పొదిలి పట్టణం మొత్తం కవాతు నిర్వహింస్తున్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ యమ్ శ్రీనివాసరావు యస్ ఐ జె నాగరాజు ఎ యస్ ఐ లు వదూద్ లు పాల్గొన్నారు