ఆబ్కారీశాఖ అదుపులో పరారీలో ఉన్న నాటుసారా విక్రేత నాగులూరి ఏసు
పొదిలి మండలం గోగినేనివారిపాలెం గ్రామ పొలాలలో అక్రమంగా నాటుసారా తయారుచేస్తూ పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తూ ఆబ్కారీ శాఖ అధికారుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతూ పరారీలో ఉన్న నాగులూరి ఏసును బుధవారం నాడు గోగినేనివారిపాలెం గ్రామంలో ఉన్నాడనే సమాచారం అందుకున్న ఆబ్కారీశాఖ రక్షక భటులు మాటువేసి అతని అదుపులోకి తీసుకుని స్థానిక ఆబ్కారీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు….. అలాగే గురువారంనాడు పొదిలి న్యాయస్థానం నందు హాజరుపరచనున్నట్లు ఆబ్కారీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు.
ఈ సమావేశంలో ఆబ్కారీశాఖ అధికారులు ఆవులయ్య, దుర్గాప్రసాద్, పొదిలి వలయపరిధి అధికారి వెంకట్రావు, పొదిలి ఆబ్కారీ రక్షణ అధికారి వెంకటేశ్వర్లు, ఆబ్కారీ శాఖ రక్షక భటులు షేక్ బాజి, ఖాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.