అక్రమ ఇసుక ట్రాక్టర్ స్వాధీనం ఒకరి అరెస్టు
అక్రమ ఇసుక ట్రాక్టర్ స్వాధీనం ఒకరి అరెస్టు సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక దర్శి రోడ్డు లోని క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పొదిలి స్టేషన్ అధికారులు స్వాధీనం చేసుకొని ఒక్కరిని అరెస్టు చేసినట్లు మరియు ట్రాక్టర్ నందు 3 టన్నుల అక్రమ ఇసుక ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎఈయస్ దుర్గాప్రసాద్, పొదిలి యస్ఇబి స్టేషన్ యస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబులు కె వెంకట్రావు ఖాజా ఖాన్, కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు