ఇద్దరు చిన్నారుల విద్యకు ఆసరా…… దాతృత్వాన్ని చాటుకున్న ఓ అమ్మ

ఇద్దరు చిన్నారుల చదువుకు ఆసరాగా నిలిచి ఓ తల్లి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే స్థానిక తాలూకా ఆఫీసు వీధిలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు నిరుపేద విద్యార్థులలైన హర్షవర్ధన్, సాయి ప్రణీత్ లు 1వ తరగతి చదువుతున్నారు…. కానీ వీరి కుటుంబాలకు చదివించే స్థోమత లేదు….. పాఠశాల సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న పొదిలిటైమ్స్ ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత సామి వెంకట పద్మావతి పాఠశాల అధ్యాపకులను కలిసి ఇద్దరు పిల్లల చదువుకు (వారి ఉన్నత విద్యాభ్యాసం) అయ్యే ఖర్చును తాను భరిస్తానని తెలపడంతో ఈ విషయాన్ని అధ్యాపకులు పిల్లల కుటుంబ సభ్యులకు తెలుపగా వారు చాలా సంతోషంగా అంగీకరించారు….. తనలోని దాతృత్వానికి పాఠశాల యాజమాన్యం సామి వెంకటపద్మావతికి కృతజ్ఞతలు తెలిపారు….. ఈ విషయంపై పొదిలిటైమ్స్ ప్రతినిధితో పద్మావతి మాట్లాడుతూ ఆర్ధిక స్థోమతలేక ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తున్నారని…. ప్రతిభకు విద్య దూరం కాకూడదని విశ్వసిస్తున్నానన్నారు….. ఆర్ధికంగా స్థిరపడినవారు నిరుపేదలను గుర్తించి వారిని విద్యకు దూరం అవకుండా చూస్తే ఎంతోమంది అత్యున్నత స్థానాలకు చేరుకోవడంతో ఎంతో సహాయపడిన వారు అవుతారన్నారు…… ఇలా పిల్లలను దత్తత తీసుకోవడం ఒక సామాజిక మార్పుకు పునాది అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే ఈ పిల్లల చదువులకు ఆమె తదనంతరం కూడా కొనసాగించే బాధ్యతలు ఆమె కుమారుడికి అప్పగించినట్లు ఆమె తెలిపారు.