ఆశా కార్యకర్త పై దాడి కేసు నమోదు

ఆశా కార్యకర్త అలేఖ్య పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సంఘటన గత అర్ధరాత్రి జరిగింది. వివరాలు లోకి వెళ్ళితే గత అర్థరాత్రి ఇంటి లో నిద్రించే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చెయ్యటంతో హుటాహుటిన ప్రభుత్వం వైద్యశాలకు వెళ్లి ప్రాథమిక చికిత్స తీసుకొని మేరగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. విషయం తెలుసుకున్న యస్ఐ సురేష్ తన సిబ్బందితో వెళ్లి దాడి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు  సమాచారం.