కండక్టర్ పై దాడి చేసిన ఉప్పలపాడు యువకులు
పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద ఆర్టీసీ కాంట్రాక్టర్ పై యువకులు దాడి చేసిన సంఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది.
పొదిలి డిపో చెందిన ఎపి03 జడ్ 5348 బస్సు ఒంగోలు నుంచి పొదిలి కి వచ్చే క్రమంలో ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఇద్దరు యువకులు బస్సును క్రాస్ చేసి సమయంలో బస్సు హారన్ ను కొట్టాడని ఉప్పలపాడు గ్రామ నందు బస్సు నిలిపి గోడవకు దిగిన సందర్భంలో బస్సు కండక్టర్ కె శ్రీనివాసరావు వారిని వారించంటంతో కోపోద్రిక్తులైన యువకులు ఆర్టీసీ కండక్టర్ ను బస్సులో నుంచి లాగి దాడి చేసి ప్రక్కనే ఉన్న మురుగు గుంటలో కి తొసి వేసి క్యాష్ బ్యాక్ ను, టిమ్ మిషన్ ను కూడా మురుగు గుంటలో వేసారు స్థానికులు ప్రయాణికులు వారి నుంచి కండక్టర్ ను కాపాడారు.
జరిగిన దాడి పై పొదిలి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు కండక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు