కోవిడ్ వ్యాక్సిన్ కై పేర్లు నమోదు చేసుకొవాలని అధికారులు పిలుపు
కోవిడ్ వ్యాక్సిన్ కై పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు తహాశీల్దార్ హనుమంతరావు అధ్యక్షతనతో జరిగిన మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప్పలపాడు వైద్య అధికారిణి షేక్ షాహిదా మాట్లాడుతూ కోవిడ్, వ్యాక్సిన్ ప్రక్రియ మూడో దశ మార్చి 1వ తేదీ నుంచి మొదలైందని మూడో దశ లో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న 45 సంవత్సరాల వేసి పైబడిన వారు తప్పని సరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని తెలిపారు.
వ్యాక్సినేషన్ కోరకు కో విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేకపోతే గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావును, నగర పంచాయితీ కమిషనర్ భవాని ప్రసాద్, నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి మండల వైద్య శాఖ సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు