ఆటో డ్రైవర్ దాడి….. తీవ్రంగా గాయపడిన యువకుడు

స్థానిక విశ్వనాథపురం బస్టాండ్ సెంటర్ వద్ద బాలకృష్ణ అనే యువకుడిపై ఆటో డ్రైవర్ దాడి చేసిన సంఘటన ఆదివారంనాడు రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఓ వ్యక్తిపై ఆటో డ్రైవర్ వాగ్వాదానికి దిగగా బాలకృష్ణ అనే యువకుడు ఇరువురిని తప్పించబోవడంతో…… అడ్డువచ్చాడనే అకారణంగా ఆటోడ్రైవర్ కర్రలు, రాడ్లతో దాడిచేయడంతో బాలకృష్ణకు తల, వీపు భాగాలలో తీవ్రగాయాలై రక్తస్రావం అవడంతో స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.