ఆటో బోల్తా తప్పిన పెనుప్రమాదం ఆరుగురికి గాయాలు

పొదిలి పట్టణం మాదాలవారిపాలెం సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని అనంతరం ఆటో బోల్తా పడి సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెందిన ఆరుగురు విద్యార్థులు మరో ఇద్దరు ప్రయాణికులు ఆటో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొద్ది దూరంలో ఆటో బోల్తా పడింది.

108 వాహనం ద్వారా గాయపడిన విద్యార్థులను ప్రభుత్వం వైద్యశాల తరలించి చికిత్స అందిస్తున్నారు.

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది