ఆత్మ నిర్భార్ భారత్ పై యువతకు అవగహన తరగతలు

నేహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మర్రిపూడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఆత్మ నిర్బార్ భారత్ పై యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ వాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నేహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి కమలేష్ మాట్లాడుతూ    యువతకు మంచి అలవాట్లు, ఫిట్ ఇండియా పై అవగహన మరియు ప్రస్తుతం వున్న అవకాశాలను ఉపయోగించుకొని యువతి యువకులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రతిరోజు కనీసం 20 నిమషాలు వ్యాయమం అవసరమని అన్నారు.

అనంతరం యువతి యువకులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో యస్ఐ అంకమ్మరావు, ఎంపిడిఓ రాంబాబు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు కదిరి భాస్కరరావు బి రాంబాబు, ఎంపిటిసి సభ్యులు యు చిరంజీవి న్యాయవాది కృష్ణారెడ్డి , నేహ్రు యువ కేంద్రం కోఆర్డినేటర్లు కంభంపాడు శివసాయినాద్, సొంగా ఏడుకొండలు,పతకమూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు