మహిళా చట్టాలపై అవగాహన సదస్సు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని నేత పాలెం లోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం నాడు సిడిపిఓ సుధా మారుతి అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో తల్లులు లకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గృహ హింస, మహిళా చట్టాలు, బాల్య వివాహాలు, చైల్డ్ హెల్ప్ లైన్ వంటి వాటిపై అవగాహన కల్పించారు.
మహిళలు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లలను బరువు ను తూకం వేసి గ్రేడ్ ల వారిగా దారములు కట్టారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సావిత్రి, అంగన్వాడీ కార్యకర్తలు శోభారాణి మరియు మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.