సైబర్ నేరాల పై బాలికలకు అవగాహన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి బాలికల ఉన్నత పాఠశాల నందు పొదిలి యస్ఐ వేమన ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ అవగాహన సదస్సులో భాగంగా పొదిలి సిఐ వెంకటేశ్వర్లు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై , సదస్సుకు హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
గుడ్ టచ్,”బ్యాడ్ టచ్ , స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
సైబర్ నేరాల పై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంప్రదించాలని సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930కి , సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) లో నమోదు చేయాలని యస్ఐ వేమన తెలిపారు.
విద్యార్థిని,విద్యార్థులంతా నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి బాలికల ఉన్నత పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు