విద్యార్థులకు పోలీసు విధుల గురించి అవగాహన
పొదిలి పట్టణంలోని స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం మంగళవారం నాడు విద్యార్థులకు పోలీసు స్టేషన్ నందు నిర్వహించే విధుల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు.
సందర్భంగా పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ దొంగతనం చేసిన వారిపై మూడు రకాల షీట్ల ను హత్య కేసుల్లో మరియు వివిధ తగద గొడవల కేసుల్లో పాల్గొనే వారిపై రౌడీ షీట్ల ఓపెన్ చేసి వారి పై నిఘా పెడతామని తెలిపారు.
యస్ ఐ శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగానే రసీదు అందించి విచారణ జరిపి తొలి సమాచారం నివేదిక ( యఫ్ ఐ ఆర్ ) నమోదు చేస్తామని అదే విధంగా ప్రతి ఒక్కరూ దిశా యాప్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
అనంతరం స్టేషన్ లోని వివిధ సామాగ్రి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు