కౌలు కార్డులు పై అవగాహన సదస్సు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కౌలు పై వ్యవసాయ చేసే రైతులందరూ ఖచ్చితంగా కౌలు కార్డులు తీసుకోవాలని కార్డులు లేని వారు ప్రభుత్వం నుంచి వచ్చే పంట బీమా పథకం, పంట నష్టపరిహారం, సున్న వడ్డీ పథకం, రాయితీలు ద్వారా విత్తనాలు కొనుగోలు చేయటంలో అర్హత కోల్పోవటం జరుగుతుందని కావున రైతులందరూ సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి ని సంప్రదించి కార్డులు పొందాలని మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ అన్నారు.

గురువారం నాడు స్థానిక పాములపాడు రైతు భరోసా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సు లో మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ నెలలో లోపల ఈ కైవైసి ని చేసుకోవాలని లేకపోతే ఈ పథకం ద్వారా వచ్చే 6000 వేల రూపాయలు వచ్చే అర్హత కోల్పోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు మరియు రైతు భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు