బాబాయ్ ని మట్టు పెట్టాడు ఓ కొడుకు
మద్యం మత్తులో భూ వివాదం గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి ప్రాణాలు తీసే వరకు వచ్చింది పరిస్థితి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన బాబాయ్ వెంకటేశ్వరరావు కొడుకు పుల్లారావు మద్యం షాపు వద్ద తారసపడ్డారు వీరికి గతంలో భూవివాదం ఉండడంతో ఇద్దరూ పరస్పరం వాగ్వాదానికి దిగారు.
దీంతో ఆగ్రహం చెందిన పుల్లారావు బాటిల్ పగలగొట్టి బాబాయ్ ని గొంతులో పొడిచాడు దీంతో వెంకటేశ్వరరావు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిందితుడు మద్యం మత్తులో బాబాయ్ ని పొడిచి పొలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వరకు అక్కడే వున్నాడు.
బాబాయ్ నేనే చంపానంటు బహిరంగంగా చెప్పాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పొదిలి కొనకొనమీట్ల యస్ఐలు శ్రీహరి, శివ తమ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతుడు భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య ముగ్గురు ఆడపిల్లలు కలరు