బాధ్యతలు స్వీకరించిన నూతన సిఐ
పొదిలి పోలీసు సర్కిల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా షేక్. చిన్న మీరా సాహెబ్ బాధ్యతలు స్వీకరించారు. వివరాల్లోకి వెళితే పొదిలి సిఐ శ్రీనివాసరావును విఆర్ కు బదిలీ చేసి ఆ స్థానంలో గుంటూరు రేంజ్ విఆర్ లో ఉన్న చిన్న మీరా సాహెబ్ కు పదోన్నతి కల్పించి పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం సోమవారంనాడు చిన్న మీరా సాహెబ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సిఐ మాట్లాడుతూ పొదిలిలో ట్రాఫిక్ సమస్య తన దృష్టికి వచ్చిందని ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెడతామని అలాగే దొంగతనాలను జరగకుండా అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.