థెరీసా పురస్కారం అందుకున్న నాని ఘనంగా సత్కరించిన బాదుల్లా
మదర్ థెరిస్సా జాతీయ ఉత్తమ పురస్కారం అందుకున్న ఆకుమళ్ళ నాని ప్రకాశం జిల్లా ఎంబిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక విజయవాడ పడమట లోని ఎంబిసి రాష్ట్ర కార్యాలయంలో నందు రాష్ట్ర అధ్యక్షులు అకుమళ్ళ నాని ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంబిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్లా మాట్లాడుతూ ఆకుమళ్ళ నాని అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సామాజిక సమస్యలపై పోరాడుతు రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిసిల్లో చైతన్యం నింపుతూ ఒక బలమైన శక్తి తయారు కీలకపాత్ర పోషిస్తున్న నాని మరి ఎన్నో ఉన్నతస్థాయి అవార్డులు , పదవులు అలంకరించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బాదుల్లా వెంట బిజెపి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు