బజాజ్ రమణారెడ్డి బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి :సిఐ శ్రీనివాసరావు

జూన్ 30వ తేదీ తెలుగు యువత మండల అధ్యక్షుడు కేసులో కీలక నిందితుడైన కనుబద్ది రమణారెడ్డి(బజాజ్ రమణారెడ్డి) గురించి పోలీసులు చేపట్టిన గాలింపు మరియు స్థానికుల విచారణలో రమణారెడ్డికి సంబంధించిన మరో కోణం వెలుగులోకి వచ్చింది. పొదిలి సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు కనుబద్ది రమణారెడ్డి అలియాస్ బజాజ్ రమణారెడ్డి 10 రూపాయల వడ్డీకి రుణాలు ఇవ్వడం అతని వద్ద అప్పు తీసుకున్న వారి నుండి సంతకం చేయించుకున్న ఖాళీ చెక్కులు మరియు ప్రామిసరి నోట్లు వంటివి తీసుకుని అప్పు పొందిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందిందని అదే విధంగా అప్పు సరైన సమయానికి చెల్లించని వారిపై దాడికి సైతం వెనుకడకుండా వారిని మరియు వారి కుటుంబాలను కూడా బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు ఇతనిపై ఉన్న కేసుల దృష్ట్యా ఇతనిపై రౌడీషీటు తెరిచేందుకు ఇతని పేరు పరిశీలనలో ఉందని రమణారెడ్డి వల్ల నష్టపోయిన వారు భయపడి కేసులు పెట్టనివారు మరియు బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసువారికి ఫిర్యాదు చేయవచ్చునని వారికి తగిన విధంగా న్యాయం చేసే దిశగా బాధితులకు అండగా ఉంటామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు.