ప్రత్యేక హోదా సంతకాల ఉద్యమం………. కరపత్రాన్ని ఆవిష్కరించిన బాలినేని

ప్రత్యేక హోదా సంతకాల సేకరణ ఉద్యమం కరపత్రాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనువాసులరెడ్డి ఆవిష్కరించారు. వివరాల్లోకి వెళితే బాలినేని యువసేన ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షులు సుబ్బానాచారి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ స్థాయి నుండి జిల్లాస్ధాయి వరకు కార్మిక, కర్షక, రైతు, న్యాయవాదులు, మహిళలు, యువజన, విద్యార్థి వంటి అన్ని వర్గాల ప్రజల నుండి పెద్ద ఎత్తున సంతకాలను సేకరించి ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్లి ప్రత్యేక హోదా సాధించే దిశగా సంతకాలు ఉద్యమాన్ని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపి అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వరికూటి రమణారెడ్డి, కుప్పం ప్రసాద్, నరాల రమణారెడ్డి, జెక్కిరెడ్డి కృష్ణారెడ్డి, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు