ఘనంగా బాలినేని జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే బుధవారం స్ధానిక విశ్వనాథపురం వైయస్ఆర్ విగ్రహం వద్ద బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు సుబ్బనాచారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన కేకును మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి కట్ చేసి అభిమానులకు పంచిపెట్టి అనంతరం అక్కడ హాజరైన వారికి అల్పహారం పంచిపెట్టారు. అనంతరం జూనియర్ కళాశాలలో బాలినేని జలధార కార్యక్రమాన్ని జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ కళాశాలకు మంచి నీటి సదుపాయం కల్పించుటకు కృషి చేస్తానని అన్నారు. జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధులతో డీప్ బోర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల వైసీపీ అధ్యక్షులు రాచమల్ల వెంకట్రామిరెడ్డి, మండల కో అప్షన్ సభ్యులు మస్తాన్ వలి, పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ బాషా, షేక్ నుర్జహన్, వైసీపీ నాయకులు షేక్ రబ్బాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ గౌస్, వైసీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.