తహశీల్దార్ ను అభినందించిన బాలినేని యువసేన
పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావును బాలినేని యువసేన అభినందనలు తెలుపుతూ ఘనంగా సత్కరించింది. వివరాల్లోకి స్ధానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు దొడ్డేపల్లి సుబ్బనాచారి ఆధ్వర్యంలో తహశీల్దార్ ప్రభాకరరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సుబ్బనాచారి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో మరియు ప్రజా సమస్యలు పరిష్కారంలో చొరవ చూపించి తక్షణమే పరిష్కారం చూపుతున్నారని కాబట్టి అలాంటి అధికారుల సేవలకు అభినందనలతో సత్కారం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హనీమూన్ శ్రీనివాసరెడ్డి, షేక్ నాయబ్ రసూల్, జెక్కిరెడ్డి కృష్ణారెడ్డి, షేక్ అబ్దుల్ కలాం ఆజాద్, దొడ్డు శ్రీనివాసరెడ్డి, బసిరెడ్డి నాగార్జున రెడ్డి, కళ్ళం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.