ప్లాస్టిక్ పై నిషేధం.. ప్లాస్టిక్ వాడితే భారీగా జరిమానా : మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించటం చర్యలు ల్లో భాగం పొదిలి మున్సిపల్ కార్యాలయం నందు వ్యాపారస్తులు తో సమావేశమైన మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మాట్లాడుతూ ప్లాస్టిక్ పై నిషేధం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిందని కావున వ్యాపారస్తులు అమ్మకాలు జరిపితే భారీగా జరిమానా జైలు తప్పదని హెచ్చరించారు.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గత ఏడాది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, నిషేధాన్ని ప్రకటించిందని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే… ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల కింద – వస్తువుల ప్యాకేజింగ్ నుంచి సీసాలు-షాంపూ, డిటర్జెంట్, సౌందర్య సాధనాలు), పాలిథిన్ బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్, చెత్త బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వాటి ఉత్పత్తులు ఉన్నాయని తెలిపారు.
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) జూలై 1వతేదీ నుంచి నుంచి ప్రజలు కొన్ని వస్తువులను ఉపయోగించకూదని సర్క్యులర్ ప్రకారం, జులై 1, 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్(SUP) వస్తువులు నిషేధించనున్నారు.
దీని కింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించారు. తయారీ, ఎగుమతులు, నిల్వ, పంపిణీ, విక్రయాల కోసం వినియోగిస్తున్న 19 నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఐటెమ్స్‌కు ప్రత్యమ్నాయాలను సిద్ధం చేసుకునేందుకు ఇండస్ట్రీ, ప్రజలకు కేంద్ర పర్యవారణ శాఖ సమయం ఇచ్చిందని అన్నారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని రిపోర్ట్ చేయడానికి,ఫిర్యాదులను చేయడానికి ఆన్‌లైన్ యాప్ కూడా ప్రారంభించబడిందని అన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. పదేపదే నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్నవారికి ఈ జరిమానా పెరుగుతూ ఉంటుంది. సంబంధిత స్థానిక సంస్థల నిర్ణయం ఆధారంగా జరిమానా(Penalty)తీవ్రత ఆధారపడి ఉంటుంది.
జరిమానా లేదా జైలుశిక్ష విధింపునకు అవకాశం ఉంటుంది.
డ్రైనేజీలో పేరుకుపోతున్న, పర్యావరణ వ్యవస్థకు నష్టం చేకూర్చుతున్న ప్లాస్టిక్ వాడకంపైనా జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సమర్ధవంతమైన ఎంగేజ్ మెంట్,అన్ని వర్గాలు, ఉత్సాహభరితమైన ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే నిషేధం యొక్క విజయం సాధ్యమవుతుందని
అయినా అన్నారు.
పర్యవారణ మంత్రిత్వశాఖ నిషేధిత జాబితాలో...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్- ప్లాస్టిక్ స్టిక్స్ కలిగిన ఇయర్‌బర్డ్స్‌తోపాటు బెలూన్స్‌లో వినియోగించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యాండీ స్టిక్స్, ఐస్‌క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌లో వినియోగించే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గ్లాసులు, ప్లాస్టిక్ కత్తులు, ఫోర్క్స్, స్పూన్స్, స్ట్రా, ట్రేయ్స్ ఉన్నాయి.
వీటితోపాటు స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డ్స్, సిగరెట్ ప్యాకెట్స్ ప్యాకింగ్‌కు వినియోగించే ప్యాకేజింగ్ ఫిల్మ్స్, ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు ఉన్నాయి. SUP వస్తువులను విక్రయించకూడదనే షరతుతో తాజా వాణిజ్య లైసెన్స్‌లను జారీ చేయాలని CPCB స్థానిక అధికారులను ఆదేశించింది.
మరీ ముఖ్యంగా నిషేధిత వస్తువులను విక్రయిస్తున్నట్లు తేలితే ప్రస్తుతం ఉన్న వాణిజ్య లైసెన్స్‌లను రద్దు చేస్తారని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు