సంక్షేమ పథకాలను బార్ అసోసియేషన్ కు కూడా వర్తింపజేయండి : బార్ అసోసియేషన్ పొదిలి
పొదిలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. వివరాల్లోకి వెళితే నూతన హైకోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్ఛార్జి మరియు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసిన పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ (షబ్బీర్) న్యాయవాదులు తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలైన హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలలో అవకాశం కల్పించమని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ (షబ్బీర్)అధ్యక్షులు షబ్బీర్, బి వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసులు, ఎస్ఎం బాషా, పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.