ఐదుగురిపై బార్ అసోసియేషన్ వేటు
పొదిలి బార్ అసోసియేషన్ నెంబర్ 182/2014 నుండి ఐదుగురు న్యాయవాదులపై సస్పెండ్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే నిన్న ఐదుగురు వ్యక్తులు కలిసి నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు పత్రికా ప్రకటన ఇవ్వడంపై శనివారం సమావేశం అయిన బార్ అసోసియేషన్ షేక్ షబ్బీర్, బోడగిరి వెంకటేశ్వర్లు, గంగవరపు శ్రీనివాసులు, యస్ఎం బాషా, గాలిముట్టి పెద్దయ్యలను చీలిక బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నందున వారిని సంస్థ నుండి తొలగిస్తు తీర్మానం చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముల్లా ఖాదర్ వలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ నాయకులు నాగరాజు, సుబ్బారావు, నాయబ్ రసూల్, అబ్దుల్ కలామ్, దర్నాసి రామారావు, మునగాల వెంకట రమణ కిషోర్, వెలిశెట్టి వెంకటేశ్వర్లు, గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.