భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ భారీ కొవ్వుత్తుల ర్యాలీ
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అసువులు బాసిన జవాన్లకు సంఘీభావంగా భారీ కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి అమ్మవారిశాల ,చిన్నబస్టాండ్ నుండి పెద్ద బస్టాండ్ వరకు పొదిలి పట్టణ ప్రజలు కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఖబడ్దార్…. పాకిస్థాన్ ముర్ధాబాద్ అంటూ… వందేమాతరం… భారత మాతాకి జై…
హిందుస్థాన్ మేరి జాన్…. భారతదేశం మాప్రాణం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజా సంఘంల నాయకులు కొత్తూరి చెంచు నారయణ రావూరి సత్యనారాయణ యక్కిలి శేషగిరి సోమిశెట్టి పద్మవతి రావిక్రింద కృష్ణ సూరి తదితరులు పాల్గొన్నారు.