సీట్లు కేటాయింపులో బిసిలకు ప్రాధాన్యత కల్పించాలి.
ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చి కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం
వెనుకబడిన తరగతులు వారికి చట్ట సభలో పోటీ చేయడానికి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును బిసి కులాల నాయకులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే సోమవారం స్ధానిక యాదవ మహాసభ కార్యాలయంలో బిసి కులాల ఐక్య వేదిక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము చేసిన ఉద్యమం ఫలితంగా ఇప్పటి వరకు ఫెడరేషన్లుగా ఉన్న వాటిని కార్పొరేషన్లుగా మార్చి ఇతర బిసి కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ తక్షణమే వాటికి చట్టబద్ధత కల్పించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో పోటికి బిసిలకు గౌరవ ప్రదమైన సీట్లు కేటాయించాలని లేకపోతే ఏ పార్టీ అధిక సీట్లు కేటాయిస్తే ఆ పార్టీకే మా మద్దతు ఉంటుందని వారు తెలిపారు.