కార్పొరేషన్లతో బీసీ కులాలు సమూలంగా అభివృద్ధి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సంబరాలు

మార్కాపురం నియోజకవర్గంకు మూడు డైరెక్టర్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచే వ్యక్తి_వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కార్పొరేషన్లతో బీసీ కులాలు సమూలంగా అభివృద్ధి చెందుతాయి

శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి

వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

వెనుకబడినటువంటి కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని,సామాజిక,ఆర్థిక సమతుల్యం కావాలనేటువంటి ఆలోచనతోటిదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్నిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
తీసుకున్నారని శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక రోడ్లు మరియు భవనాల అతిథి గృహం నుంచి పెద్ద బస్టాండ్ వైయస్సార్ విగ్రహాం వరకు ర్యాలీ నిర్వహించి విగ్రహాన్ని కి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.

అనంతరం స్థానిక రోడ్లు మరియు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో 30వేలు పైగా జనాభా ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి  56 కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక రాజకీయ సమతుల్యం పాటించాలనేటువంటి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం.

ఈ నిర్ణయంతోటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు పేద ప్రజానీకం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదుని అదేవిధంగా నియోజకవర్గం నుంచి వాల్మీకి, ఆర్యకటిక , ఈడిగ, కార్పొరేషన్ డైరెక్టర్లు ఎంపిక చేసినందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండలం వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాసులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జుల రమణా రెడ్డి మరియు పట్టణ మరియు మండల వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు