బిసి ఎస్సీ ఎస్టీ మహిళ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన నగర పంచాయితీ కమిషనర్
బిసి ఎస్సీ ఎస్టీ మహిళ ఓటర్ల ముసాయిదా జాబితాను నగర పంచాయితీ కమిషనర్ భవాని ప్రసాద్ విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక నగర పంచాయితీ కార్యాలయం నందు ఎలక్షన్ అధారిటీ మరియు సంచాలకులు పురపాలక శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు వార్డుల నందు బిసి ఎస్సీ ఎస్టీ మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఇంటి ఇంటికి తిరిగి ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మరియు తహశీల్దారు, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితాను అందుబాటులో ఉంచామని నగర పంచాయితీ కమిషనర్ భవాని ప్రసాద్ తెలిపారు.
కావున సదరు ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు ఉంటే 10తేదీ నుంచి 13 తేదీ లోపల యస్సీ యస్టీ ఓటర్ జాబితాపై శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు కు ఫారం 2 ద్వారా బిసి, మహిళా ఓటర్ల జాబితా పై ఫారం 3 ద్వారా జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ కు ఫిర్యాదులు అందజేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు