బీసీల అండతో అధికారంలోకి రానున్నది తెదేపానే : నూకసాని
బిసిల అండతో ఈ ఎన్నికలలో తెదేపా విజయఢంకా మోగించనుందని… మరోమారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని ఓ ప్రైవేటు ఛాంబర్ నందు అఖిలభారత యాదవ మహాసభ నాయకులతో ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ మరియు జిల్లా మరియు రాష్ట్రంలోని పలు నియోజవర్గాల పరిస్థితి గురించి చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవలనే తపనతో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలతో అత్యధిక పోలింగ్ శాతం నమోదయింది అంటే చంద్రబాబు సీఎం కావాలి ప్రజా సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే దృక్పథంతో ప్రజలు ఉన్నారని అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా 23బిసి కులాలకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని అన్నారు.
అలాగే పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛను రెట్టింపు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, మొదలైన సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడుపై అపార నమ్మకంతో జనం ఓట్లు వేయడం జరిగిందని….. మే 23న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు.
తన పిలుపుకు స్పందించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహకరించిన యాదవ సామాజిక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహయాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, యార్రమూడి వెంకట్రావు, తెలుగు యువత మండల అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్, పొదిలి కొనకనమిట్ల మండలాల నాయకులు మువ్వా రాజు, కనకం వెంకట్రావు, పెమ్మని రాజు, బలగాని నాగరాజు, చాగంటి వెంకటేశ్వర్లు, సన్నెబోయిన రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.