బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీలో పొల్లా, బత్తుల
బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో పొల్లా నరసింహారావు యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్ లకు చోటు కల్పిస్తూ నియామకపత్రాలను అందజేశారు .
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు విజయవాడలో జరిగిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పొల్లా నరసింహరావు యాదవ్, కార్యనిర్వహక కార్యదర్శిగా బత్తుల వెంకటేష్ యాదవ్ లను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య….రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావులు నియామకపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా పొల్లా నరసింహరావు, బత్తుల వెంకటేష్ యాదవ్ లు మాట్లాడుతూ తమ శక్తి మేరకు బిసి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని మమ్మల్ని నమ్మి ఇంతటి కీలకమైన పదవి బాధ్యతలను అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు, జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.