గ్రామోత్సవాన్ని జయప్రదం చేయండి : బెల్లంకొండ శ్రీనివాస్

కంభాలపాడు గ్రామంలోని అంకాలమ్మ దేవస్థాన గ్రామోత్సోవాన్ని జయప్రదం చేయాలని బెల్లంకొండ విద్యా సంస్థల చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ కోరారు. దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహణ చేశామని, విజయదశమి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గ్రామోత్సోవం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా
అమ్మవారికి శ్రీ ఆలూరి వెంకటరమణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఆలంకరణ జరుగుతుందని కావున భక్తులందరూ హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించి గ్రామోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా భక్తుల సౌకర్యార్ధం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ పొదిలి టైమ్స్ కు తెలిపారు.