ఇమాంసా ను ఘనంగా సత్కరించిన బెల్లంకొండ విద్యాసంస్థల అధినేత
వైద్యల దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణం చెందిన ప్రాథమిక చికిత్స కేంద్ర వైద్యులు సయ్యద్ ఇమాంసా ను బెల్లంకొండ విద్యాసంస్థల అధినేత శ్రీనివాస్ , కంబాలపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, పొదిలి నాబార్డు ప్రాజెక్టు డైరెక్టర్ కొంకాల రామ్మోహన్, కంభాలపాడు యువ నాయకులు ఆవులూరి నాయుడు తదితరులు ఇమాంసా ప్రథమ చికిత్స కేంద్రం లో దుశ్యాలువ తో సత్కరించి అనంతరం మెమొంటో ను అందజేశారు.
ఈ సందర్భంగా కొండ విద్యాసంస్థల అధినేత బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర అ సమరయోధుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న శ్రీ బిధాన్ చంద్ర రాయ్ జయంతిని మనదేశంలో వైద్యుల దినోత్సవం గా జరుపుకోవటం సాంప్రదాయము అన్నారు వైద్యం చేసే ప్రతి ఎం బి బి ఎస్, ఎండి , ఎం ఎస్ , బి డి ఎస్, ఆయుర్వేద, హోమియో, ఫిజియోథెరపీ, ఆర్.ఎం.పి, పి ఎన్ పి, వైద్యం చేసే ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు పొదిలి పట్టణము నందు ఆర్ఎంపీ వైద్యులు పేద గ్రామీణ ప్రాంత ప్రజల అభిమానాన్ని చురుగోన్న డాక్టర్ సయ్యద్ ఇమాంసా సేవాలను కొనియాడారు.