బెల్లంకొండ విద్యాసంస్థల చైర్మన్ బెల్లంకొండ రంగయ్యకు నివాళులు అర్పించిన ప్రముఖులు

బెల్లంకొండ విద్యాసంస్థల చైర్మన్ బెల్లంకొండ రంగయ్య పెద్దకర్మ తురిమెళ్ళ గ్రామములో నిర్వహించారు. విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి శ్రీ పసుపులేటి రంగయ్య గారు అధ్యక్షత వహించిన ఈ సంతాప సభలో పలువురు ప్రముఖులు రంగయ్య ఉపాధ్యాయ వృత్తిలో వారు చేసిన సేవలను గురించి గుర్తుచేసుకున్నారు. గిద్దలూరు మాజీ శాసన సభ్యులు అన్నా రాంబాబు మాట్లాడుతూ రంగయ్య ఎంతోమంది శిష్యులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జనసేన జిల్లా నాయకులు బొటుకు రమేష్ ప్రసంగిస్తూ రంగయ్య ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తన కొడుకు మరియు కోడలు ద్వారా పలు విద్యాసంస్థలు నెలకొల్పి వారికి వెలుగునిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఏఎంసి చైర్మన్లు ఆర్. డీ. రామకృష్ణారావు, తాటిశెట్టి రామ్మోహన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ శ్రీ పగడాల రంగస్వామి, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యదర్శి ఇమ్మడి కాశీనాద్, మార్కాపురం నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ పివి.కృష్ణారావు , బెల్లంకొండ విద్యాసంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, పామూరు ఆల్ఫా విద్యా సంస్థల కరస్పాండెంట్ బిజ్జం శ్రీనివాసరెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ రామిరెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కసిరెడ్డి రమణారెడ్డి, యెలం వెంకటేశ్వర్లు, గిద్దలూరూ నియాజవర్గ జనసేన నాయకులు డా,,వులవల బాల నారాయణ, తాటిశెట్టి ప్రసాద్, తురిమెళ్ళ సర్పంచ్ యన్ వీరమ్మ, బిట్స్ ప్రిన్సిపాల్ నారపుశెట్టి నాయుడు, వివిధ పార్టీల నాయకులు, పలు విద్యా సంస్థల కరస్పాండెంట్ లు, హిందీ భాషా పండితులు, సాహితీ వేత్తలు, పలువురు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొని నివాళులర్పించారు.