మద్యం బెల్టుషాపుపై దాడి…..నిర్వాహకుడి అరెస్టు
పట్టణంలోని స్థానిక బాప్టిస్టుపాలెం వద్దగల షరీఫ్ టైర్ షాపులో పొదిలి ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి… అందులో అక్రమంగా నిల్వ ఉంచిన 151 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు షేక్ అహమ్మద్ షరీఫ్ బాషా ను అదుపులోకి తీసుకున్నారు.
నిర్వాహకుడు షరీఫ్ పై కేసును నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.