బీవోబీ 115వ వ్యవస్థాపక దినోత్సవం భవిత పాఠశాలకు రిఫ్రిజిరేటర్ బహుకరణ
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది.
వివరాల్లోకి వెళితే బ్యాంక్ ఆఫ్ బరోడా (బివోబి) పొదిలి బ్రాంచ్ నందు బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకుడు బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ చిత్ర పటానికి బ్యాంకు మేనేజర్ మురళి కృష్ణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మురళి కృష్ణ మాట్లాడుతూ బరోడా చెందిన మహారాజు సాయాజీరావు గైక్వాడ్ III దీనిని స్థాపించారని ఒక మిలియన్ రూపాయల పెయిడ్ అప్ క్యాపిటల్ తో ఈ బ్యాంకును స్థాపించి బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 జూలై 20న ది బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్ పేరుతో ప్రైవేట్ బ్యాంక్‌గా స్థాపించబడి 1910లో అహమదాబాద్ నగరంలో బ్యాంకు తమ మొదటి శాఖను ప్రారంభించిందని 1919వ సంవత్సరంలో ముంబై నగరంలో తమ మొదటి శాఖను ప్రారంభించారని ఆయన అన్నారు.
వినియోగదారులకు మెరుగైన సేవలనందిస్తూ, అన్ని రంగాల వ్యాపార వర్గాల అభ్యున్నతిలో భాగస్వామిగా నిలిచేందుకు బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 8,500 శాఖలు, 11 వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయని ఆయన అన్నారు
అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో గల భవిత పాఠశాల విద్యార్థులకు 10 వేల రూపాయలు రిఫ్రిజిరేటర్ ను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ మురళి కృష్ణ భవిత పాఠశాల అధ్యాపకులు గోపాలకృష్ణ,షహిదా, సిఆర్పీ కిరణ్మయి, నాగరాజు, మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు