పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019….. ఉత్తమ సంఘ సేవకుడు అవార్డు గ్రహీత కల్లం వెంకట సుబ్బారెడ్డి

పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ సంఘ సేవకుడు అవార్డు గ్రహీతగా కల్లం వెంకట సుబ్బారెడ్డిని ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.

పొదిలి పట్టణంలోని స్థానిక విశ్వనాథపురం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు లక్షల రూపాయల సమీకరించి వాకింగ్ ట్రాక్ నిర్మాణం మరియు మొక్కలు పెంపకంతో పాటు పట్టణంలో జరిగే వివిధ సామాజిక కార్యక్రమాల్లో తన పేరును ప్రచారం చేసుకోకుండా తన ఆర్థిక సహకరం అందిస్తూ సంఘసేవలో భాగమైన కల్లం వెంకట సుబ్బారెడ్డిని గుర్తించి పొదిలిటైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ సంఘ సేవకుడిగా అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.