ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న పొదిలి సిఐ, ఆర్ఐ, వ్యవసాయ అధికారి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునరావు పొదిలి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ ,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు కానిస్టేబుల్ కోటేశ్వరరావులు ఉత్తమ ప్రతిభ అవార్డులను అందుకున్నారు
వివరాల్లోకి వెళితే 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో శాంతిభద్రతల పరిరక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునరావు కు పొదిలి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ పొదిలి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు కానిస్టేబుల్ కోటేశ్వరరావు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.