ఆదిలక్ష్మి కి ఉత్తమ ప్రతిభ పురస్కారం
లీగల్ వాలంటీర్ బొనిగల ఆదిలక్ష్మి కి ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకుంది.
ఆదివారం నాడు ఒంగోలు కోర్టు ప్రాంగణంలో జరిగిన అజాదిక అమృత మహోత్సవంలో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అండ్ ఔట్రీచ్ క్యాంపైన్ కార్యక్రమంలో బాలలకు న్యాయ చట్టాలపై మరియు న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం పై అవగాహన కలిగించినందుకు పొదిలి మండలం న్యాయ సేవాధికార సంస్థ లో పారా లీగల్ వాలంటీర్ ఆదిలక్ష్మి ని
హైకోర్టు జడ్జి మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు,ప్రకాశం జిల్లా జడ్జి న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ పి.వెంకట జ్యోతిర్మయి, జిల్లా ఎస్పి మల్లికా గార్గ్,సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీనివాసరావు
అభినందిస్తూ ప్రత్యేక మెడల్ తో సత్కరించి ప్రశంస పత్రం ను అందజేశారు.