గవర్నర్ చేతుల మీదుగా సానికొమ్ముకు పురస్కారం
పొగాకు రైతు సంఘం నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ఘనంగా సత్కరించారు. వివరాలు లోకి వెళితే రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాప్ హాలిడే (పంటవిరామం) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పుస్తకం ఆవిష్కరించి అనంతరం రాష్ట్రంలో పలువురు పొగాకు రైతులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికార భాష సంఘం అధ్యక్షులు యర్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు యలమంచిలి శివాజీ పొగాకు బోర్డు సభ్యులు రఘనాథ్ బాబు రైతు ఫౌండేషన్ అధ్యక్షులు యడ్లపల్లి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు